kcr: కేసీఆర్ కు సినీ దర్శకుడు మారుతి సూచన

  • ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై మారుతి ఆవేదన
  • రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ గడువు పెంచండి
  • విద్యాసంవత్సరం నష్టపోకుండా చర్యలు తీసుకోండి
తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్వాకంతో పలువురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఇరు తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని నింపింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు సినీ దర్శకుడు మారుతి ఓ సూచన చేశారు. 'పబ్ జీ గేమ్ లో విఫలమయితేనే పసి మనసులు ప్రాణాలు తీసుకుంటున్నాయి. అలాంటిది 12 నెలలు కష్టపడి... ఇంటర్ బోర్డు అవకతవకల వల్ల ఫెయిల్ అయితే తట్టుకోగలరా? డియర్ సీఎం సర్, రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ గడువు పెంచి, వాటి ఫీజు రద్దు చేయండి. అలాగే  విద్యార్థులు విద్యాసంవత్సరాన్ని నష్టపోకుండా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఆలోచించండి' అంటూ ట్వీట్ చేశారు.  
kcr
maruthi
director
tweet
tollywood
TRS

More Telugu News