Andhra Pradesh: ఏపీలో పోలీస్ వ్యవస్థ ఇంకా చంద్రబాబు కనుసన్నల్లోనే పనిచేస్తోంది!: వైసీపీ నేత నందిగం సురేశ్

  • ఏపీ ప్రభుత్వం మొండివైఖరితో వ్యవహరించింది
  • సమస్యను పరిష్కరించేలా పనిచేయడం లేదు
  • అమరావతిలో మీడియాతో వైసీపీ నేత

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొండివైఖరితో వ్యవహరిస్తోందనీ, రైతుల హక్కులను కాలరాసి ముందుకు వెళుతోందని వైసీపీ నేత నందిగం సురేశ్ ఆరోపించారు. ఇంకా ఏపీలో పోలీస్ వ్యవస్థ సీఎం చంద్రబాబు కనుసన్నల్లోనే పనిచేస్తోందని దుయ్యబట్టారు. అమరావతిలో ఈరోజు రైతు మీరాప్రసాద్ పై బలవంతంగా దాడిచేసే ప్రయత్నాలు చేశారే తప్ప సమస్యను పరిష్కరించేలా ప్రభుత్వం వ్యవహరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ పాలన రౌడీ పాలనను తలపిస్తోందన్నారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో నందిగం సురేశ్ మాట్లాడారు.

రాజధానికి భూములు ఇవ్వలేదని దౌర్జన్యకాండకు దిగడం దారుణమని సురేశ్ వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక రైతులందరికీ న్యాయం చేస్తామన్నారు. మీరా ప్రసాద్ భూమి విషయంలో హైకోర్టు స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈరోజు అమరావతిలో మీరా ప్రసాద్ కు చెందిన భూమిలో  రోడ్డు వేసేందుకు ఏడీసీ అధికారులు ప్రయత్నించారు. రాజధానికి భూమి ఇవ్వని మీరాప్రసాద్ దీన్ని మరికొందరు రైతులతో కలిసి అడ్డుకున్నారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు మీరాప్రసాద్ ను అరెస్ట్ చేశారు. మీరాప్రసాద్ కు వైసీపీ నేతలు మద్దతు ప్రకటించారు.

  • Loading...

More Telugu News