maruthi rao: మా నాన్న విడుదలయ్యారు.. మాకు సెక్యూరిటీ పెంచండి: అమృత

  • హత్య చేసిన వ్యక్తికి బెయిల్ ఎలా ఇస్తారు?
  • మా కుటుంబానికి ప్రాణహాని ఉంది
  • అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళతాం
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ పరువుహత్య ఘటన ఇరు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తన కూతురు అమృత కులాంతర వివాహం చేసుకుందనే ఆవేశంతో... ప్రణయ్ ను ఆమె తండ్రి మారుతీరావు హత్య చేయించాడు. ఈ నేపథ్యంలో వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్న మారుతీరావుకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

అయితే, తన తండ్రికి లభించిన బెయిల్ పై అమృత ఆవేదన వ్యక్తం చేసింది. నడిరోడ్డుపై పట్టపగలు హత్య చేయించిన వ్యక్తికి బెయిల్ ఎలా మంజూరు చేస్తారని ప్రశ్నించింది. తన తండ్రి బయటకు రావడంతో, తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. తమకు సెక్యూరిటీని పెంచాలని జిల్లా ఎస్పీని కోరింది. బెయిల్ పై హైకోర్టులో అప్పీల్ చేస్తామని... అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపింది.
maruthi rao
amrutha
pranay
muryalaguda

More Telugu News