Maruthi Rao: ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు విడుదల నేడు లేనట్టే!

  • పీడీ యాక్ట్ కింద కేసు నమోదు
  • వరంగల్ సెంట్రల్ జైల్లో నిందితులు
  • బెయిల్ పేపర్లు అందకపోవడంతో వాయిదా
ప్రణయ్ హత్యకేసు నిందితులు మారుతీరావు తదితరుల విడుదల నేడు జరగలేదు. ప్రణయ్‌ హత్య కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మారుతీరావు, శ్రవణ్‌కుమార్, కరీంపై పీడీ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వీరంతా వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్నారు. హైకోర్టు ఇచ్చిన బెయిల్‌పై నేడు వీరు విడుదల కావాల్సి ఉంది. అయితే జైలు అధికారులకు ఇంకా బెయిల్ పేపర్లు అందకపోవడంతో నిందితుల విడుదల నేడు జరగలేదు.  
Maruthi Rao
Pranay
Sravan kumar
Kareem
Warangal

More Telugu News