Siatel: అమెరికాలోని గూగుల్ క్యాంపస్ లో కూలిన క్రేన్... నలుగురి మృతి!
- సియాటెల్ లో కొత్త క్యాంపస్
- భవంతిపై భారీ క్రేన్ ఏర్పాటు
- నలుగురికి గాయాలు
సియాటెల్ లోని గూగుల్ ప్రధాన క్యాంపస్ లో నిర్మాణ పనుల్లో భాగంగా వినియోగిస్తున్న భారీ క్రేన్ విరిగి పడటంతో నలుగురు మరణించగా, మరో నలుగురికి గాయాలు అయ్యాయి. కొత్త క్యాంపస్ ను నిర్మించేందుకు భవంతి పైన అమర్చిన క్రేన్ విరిగి, కింద ఉన్న కార్లపై పడిందని, ఆరు వాహనాలు తీవ్రంగా దెబ్బతినగా, నలుగురు మరణించారని సియాటెల్ ఫైర్ డిపార్ట్ మెంట్ పేర్కొంది.
మృతి చెందిన వారిలో ఓ మహిళ ఉందని తెలిపారు. మృతుల్లో ఇద్దరు క్రేన్ ఆపరేటర్లుకాగా, మిగతావారు కార్లలో ఉన్న వారని తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారిలో నాలుగు నెలల చిన్నారి ఉందని, వీరందరినీ ఆసుపత్రులకు తరలించామని తెలిపింది. క్రేన్ విరిగి పడటంపై వాషింగ్టన్ స్టేట్ డిపార్ట్ మెంట్ ఆఫ్ లేబర్ అండ్ ఇండస్ట్రీస్ విభాగం విచారణ జరుపుతోందని పేర్కొంది.