indian army: పాకిస్థాన్ ఇంకా మన మిత్ర దేశమన్న భావనే ప్రమాదకరం: కేంద్ర మంత్రి వి.కె.సింగ్
- ఆ దేశంలో మాత్రం అటువంటి భావన లేదు
- వారు నిత్యం ఏదో రకంగా మనపై యుద్ధం చేస్తోంది
- రాజకీయ ఉచ్చులో ఇండియన్ ఆర్మీ చిక్కుకోదు
నిత్యం ఏదో ఒక రూపంలో మనపై యుద్ధం చేస్తున్న దాయాది దేశం పాకిస్థాన్‌ను ఇంకా మనం మిత్ర దేశంగా భావిస్తుండడమే పెద్ద బలహీనతని కేంద్ర మంత్రి, ఆర్మీ మాజీ చీఫ్ వి.కె.సింగ్ అన్నారు. అదే సమయంలో పాకిస్థాన్ మాత్రం మనల్ని అనునిత్యం శత్రువుగా చూస్తోందని గుర్తు చేశారు. ఆర్మీ దాడులను బీజేపీ రాజకీయం చేస్తోందన్న విమర్శల నేపధ్యంలో భారత్-పాకిస్థాన్ సంబంధాలపై వి.కె.సింగ్ మాట్లాడారు. మన దేశ సైనికులు నిజాయతీగా వారి బాధ్యతలు వారు నిర్వహిస్తారని, రాజకీయ ఉచ్చులో వారు చిక్కుకోరని స్పష్టం చేశారు. ప్రభుత్వం వారి శౌర్యాన్ని మాత్రమే ప్రశంసిస్తుందన్నారు. ప్రస్తుతం భారత్‌లో సైన్యానికి పూర్తి మద్దతుగా నిలిచే ప్రభుత్వం ఉదని, ఆర్మీ ఎలాంటి చర్యలు తీసుకున్నా అండగా ఉంటోందని ప్రశంసించారు.