Telangana: తెలంగాణలో మరో ఉద్యమం మొదలవుతోంది: గద్దర్
- కేసీఆర్ పాలనను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు
- నీళ్లు, నియామకాలు ఎక్కడ?
- 16 ఎంపీ సీట్లతో ఏంచేస్తారు?
ప్రజా గాయకుడు గద్దర్ తెలంగాణలో ప్రస్తుత పరిణామాలపై స్పందించారు. చాన్నాళ్లుగా మౌనం పాటిస్తున్న ఆయన తాజా పరిస్థితులపై గళం విప్పారు. తెలంగాణలో మరో ఉద్యమం మొదలవుతోందని అన్నారు. సీఎం కేసీఆర్ నిరంకుశ పాలనను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. నీళ్లు అన్నారు, నియామకాలు అన్నారు... అవి ఇప్పుడు ఎక్కడున్నాయి? 16 ఎంపీ సీట్లతో ఏంచేస్తారో చెప్పాలి అంటూ నిలదీశారు. తాజా పరిణామాలు చూస్తుంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని గద్దర్ అభిప్రాయపడ్డారు.