Sri Lanka: శ్రీలంక బాంబు పేలుళ్ల నిందితుల్లో ప్రిన్సిపాల్, తమిళ మీడియం టీచర్

  • పోలీసుల అదుపులో 106 మంది అనుమానితులు
  • ఉపాధ్యాయుడి నుంచి 50 సిమ్‌కార్డులు స్వాధీనం
  • శుక్రవారం నాటి ఎన్‌కౌంటర్‌లోనూ వీరి పాత్ర

శ్రీలంకలో ఈస్టర్ సండే రోజు జరిగిన వరుస బాంబు పేలుళ్ల ఘటనలో ఇప్పటి వరకు 106 మంది అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఓ స్కూలు ప్రిన్సిపాల్, తమిళ మీడియం టీచర్ కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. వీరిని దంగేదరాలోని గల్లే ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. అలాగే, టీచర్ నుంచి 50 సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు.

శుక్రవారం కల్మునై నగరంలోని సైంథముర్తు ప్రాంతంలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు జరిగిన ఎదురు కాల్పుల ఘటనలోనూ వీరి ప్రమేయం ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. ఇక్కడ ఓ ఇంట్లో నక్కిన ఉగ్రవాదులను భద్రతా దళాలు చుట్టుముట్టడంతో వారు ఎదురుకాల్పులకు దిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య రాత్రంతా భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. తప్పించుకునే మార్గం లేక ముగ్గురు ఉగ్రవాదులు తమను తాము పేల్చేసుకున్నారు.

  • Loading...

More Telugu News