nani: నానీని చూసినప్పుడల్లా నాలో పట్టుదల పెరిగిపోతూ ఉంటుంది: రానా
- 'జెర్సీ' సినిమా చూసి ఎమోషనల్ అయ్యాను
- నాని మంచి నటుడు అనడంలో సందేహం లేదు
- కొత్తదనం కోసం తపించే నటుడు నాని
నాని కథానాయకుడిగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిన 'జెర్సీ' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ నిన్న హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ఈ సినిమా యూనిట్ సభ్యులంతా హాజరయ్యారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న రానా ఈ వేదికపై మాట్లాడుతూ .. "జీవితంలో క్రికెట్ .. అమ్మాయిలు .. పెళ్లి .. పిల్లలు .. అనే అంశాలు నాకు అర్థం కావు. అలాంటి నేనే ఈ సినిమా చూసి ఎమోషనల్ అయ్యాను. దీనిని బట్టి ఇక సాధారణ ప్రేక్షకులకు ఈ సినిమా ఏ స్థాయిలో కనెక్ట్ అయ్యుంటుందో అర్థం చేసుకోవచ్చు. నాని మంచి నటుడు .. ఆయనని నేను తరచూ కలుస్తూనే ఉంటాను. తెరపై తాను ఎప్పుడూ కొత్తగా కనిపించాలనీ, తన పాత్రలు కొత్తగా అనిపించాలని ఆయన ఆరాటపడుతుంటాడు. ఆయన మాటల్లో కూడా ఆ తపన కనిపిస్తుంది. అలాంటప్పుడే నటుడిగా నన్ను నేను మరింత నిరూపించుకోవాలనే పట్టుదల నాలో పెరుగుతుంటుంది" అంటూ ఆయన నానీని అభినందించాడు.