Uttar Pradesh: మోదీకి వ్యతిరేకంగా రైతులు వేసిన నామినేషన్ల తిరస్కరణ
- నామినేషన్లను ప్రతిపాదించే వ్యక్తులు లేరు
- నామినేషన్ దాఖలు చేసిన పూల సుబ్బయ్య
- స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయాలనుకున్న రైతులు
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా 35 మంది తెలంగాణ రైతులు వేసిన నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నామినేషన్లను ప్రతిపాదించే వ్యక్తులు లేరంటూ వాటిని అధికారులు స్వీకరించలేదు. దీంతో రైతులు కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు.
అయితే వెలిగొండ సాధన సమితి అధ్యక్షుడు పూల సుబ్బయ్య మాత్రం వారణాసిలో నామినేషన్ దాఖలు చేయగలిగారు. అలాగే కొల్లూరి కిరణ్ శర్మ కూడా నామినేషన్ దాఖలు చేశారు. మోదీకి వ్యతిరేకంగా నామినేషన్లు దాఖలు చేయాలనే లక్ష్యంతో 53 మంది రైతులు వారణాసికి వెళ్లారు. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయాలని భావించారు కానీ వీరి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.