West Bengal: తమ పార్టీకే ఓటేశారో లేదో కనిపెట్టేందుకు తృణమూల్ కార్యకర్తల వినూత్న ఎత్తుగడ
- ఈవీఎంలో తృణమూల్ బటన్ కు అత్తరు పూసిన వైనం
- ఓటేసి రాగానే ఓటర్ వేలిని వాసన చూస్తున్న కార్యకర్తలు
- వాసన రాకపోతే తృణమూల్ కు ఓటేయనట్టే లెక్క!
ఈసారి సార్వత్రిక ఎన్నికలు అనేక రకాల ఆసక్తికర అంశాలకు నెలవుగా మారాయి. తాజాగా, పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఓటర్లు తమ పార్టీకే ఓటేశారో లేదో గుర్తించేందుకు సరికొత్త పంథా అనుసరించారు.
ఈవీఎంలోని తృణమూల్ బటన్ పై అత్తరు పూశారు. ఓటరు లోనికి వెళ్లి తృణమూల్ బటన్ పై నొక్కగానే ఆ అత్తరు వేలికి అంటుకుంటుంది. ఆ ఓటరు బయటికి రాగానే తృణమూల్ కార్యకర్తలు వేలిని వాసన చూసి అత్తరు వాసన వస్తే తమకే ఓటేశారని నిర్ధారించుకున్నారు. ఒకవేళ ఓటరు వేలు అత్తరు వాసన రాకపోతే మాత్రం తమకు ఓటేయనట్టే లెక్క అని తృణమూల్ కార్యకర్తల భావన.
దీనిపై పశ్చిమ బెంగాల్ లోని పలు ప్రాంతాల్లోని ఓటర్ల నుంచి ఫిర్యాదులు అందాయి. అధికార పార్టీ కార్యకర్తల తెలివి చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.