Telangana: రేవంత్ రెడ్డి ఓ రాజకీయ టెర్రరిస్టు.. ఇప్పుడు ఆయనా మాట్లాడుతున్నడు!: బాల్క సుమన్ ఆగ్రహం

  • ప్రతిపక్షాలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించాయి
  • మీ పిల్లలే ఇంటర్ లో ఉంటే ఇలా చేసేవారా?
  • హైదరాబాద్ లో మీడియాతో టీఆర్ఎస్ నేత

తెలంగాణ ఇంటర్ ఫలితాల విషయంలో ప్రతిపక్షాల వ్యవహారశైలిపై టీఆర్ఎస్ నేత బాల్క సుమన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిజంగా ఫలితాల విషయంలో అవకతవకలు జరిగాయనీ, కానీ ప్రతిపక్షాలు మాత్రం పిచ్చిలేచినట్లు బాధ్యతారహితంగా వ్యవహరించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నిజంగా ఆ ఇంటర్ విద్యార్థుల్లో మీ పిల్లలు ఉంటే ఇలాగే చేసేవారా?’ అని ప్రశ్నించారు. ప్రతిపక్షాల వ్యవహారశైలి నిజంగా చాలా బాధాకరమని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లోని టీఆర్ఎస్ ప్రధాన కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో బాల్క సుమన్ మాట్లాడారు.

సున్నితమైన, భావోద్వేగాలతో కూడిన ఇంటర్ ఫలితాల విషయంలో ప్రతిపక్షాలు సంయమనం లేకుండా వ్యవహరించాయని సుమన్ తెలిపారు. ‘నిన్న.. ఒకాయన.. ఓ రాజకీయ టెర్రరిస్టు.. నేను చెబుతున్నా.. రేవంత్ రెడ్డి ఓ రాజకీయ టెర్రరిస్టు. ఆయనా మాట్లాడుతున్నడు ఈ అంశంలో.

శంకరాచార్యులకు, పీర్ల పండుగకు ముడిపెడతడు. మోకాలికి, బోడిగుండుకు ముడిపెడతడు. ఇంటర్ బోర్డు ఫలితాల నిర్వహణ, సాంకేతిక సేవల కోసం 25.09.2017న టెండర్ పిలిచింది. అందులో ఎల్1గా గ్లోబరీనా సంస్థ నిలిచింది. ఈ కాంట్రాక్టు ఖరీదు కూ రూ.4,35,70,000. మూడేళ్లు సేవలు అందించిన అనంతరం ఈ సాఫ్ట్ వేర్ ను గ్లోబరీనా ఇంటర్ బోర్డుకు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పటి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఈ ఒప్పందాన్ని ఓకే చేశారు’ అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News