fani: పలు జిల్లాల్లో తుపాను ప్రభావం.. అల్లకల్లోలంగా బంగాళాఖాతం

  • మంగినపూడి బీచ్ లో 15 అడుగుల మేర ఎగసిపడుతున్న అలలు
  • ప.గో. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం
  • పలు చోట్ల నేలకూలిన చెట్లు

ఫణి తుపాను నేపథ్యంలో బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. ఉత్తరాంధ్రలో మాత్రమే కాకుండా తీరప్రాంతంలోని పలు జిల్లాల్లో తుపాను ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. కృష్ణా జిల్లా మంగినపూడి బీచ్ లో 15 అడుగుల మేర అలలు ఎగసి పడుతున్నాయి. దీంతో, పర్యాటకులను బీచ్ నుంచి అధికారులు పంపించేశారు. పెదపట్నం బీచ్ ను కూడా ఖాళీ చేయించారు. పశ్చిమగోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. పలు చోట్ల చెట్లు నేలకూలాయి.

మరోవైపు తుపాను ప్రభావం కారణంగా రైల్వే శాఖ అప్రమత్తమైంది. 74 రైళ్లను రద్దు చేస్తున్నట్టు తూర్పు కోస్తా రైల్వే ప్రకటించింది. బెంగళూరు, చెన్నై, సికింద్రాబాద్ వెళ్లే రైళ్లను సైతం రద్దు చేస్తున్నట్టు తెలిపింది. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం రైల్వే స్టేషన్లలో సహాయక కేంద్రాలను ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News