Shivsena: బుర్ఖా నిషేధం వ్యాఖ్యలపై వెనుకంజ వేసిన శివసేన
- అవి పార్టీ పత్రికలో వచ్చిన వ్యాఖ్యలు
- పార్టీ అధికారిక వైఖరిగా భావించాల్సిన పనిలేదు
- వివరణ ఇచ్చిన శివసేన హైకమాండ్
కొలంబో బాంబు పేలుళ్ల నేపథ్యంలో బుర్ఖాలపై నిషేధం విధిస్తూ శ్రీలంక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో భారత్ లో కూడా బుర్ఖాలపై నిషేధం విధించాలని శివసేన డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. రావణుడు పుట్టిన లంకలో బుర్ఖాలు నిషేధించారు, రాముడు పుట్టిన భారతదేశంలో బుర్ఖాలపై నిషేధం విధిస్తే తప్పేంటి? అంటూ శివసేన తర్కబద్ధమైన వ్యాఖ్యలు చేసింది. అయితే, తన వ్యాఖ్యల పట్ల దేశవ్యాప్తంగా వ్యతిరేకత రావడంతో శివసేన అధినాయకత్వం వెనక్కి తగ్గింది.
బుర్ఖాలపై నిషేధం వ్యాఖ్యలు తమ పార్టీ పత్రిక 'సామ్నా'లో వచ్చాయని, 'సామ్నా'లో వచ్చిన వ్యాఖ్యలను తమ పార్టీ చేసిన ప్రకటనగా భావించరాదని శివసేన నష్టనివారణ వ్యాఖ్యలు చేసింది. పార్టీ పత్రికలో వచ్చినంత మాత్రాన అది తమ పార్టీ అధికారిక వైఖరిగా భావించనవసరం లేదని స్పష్టం చేసింది.