Monkey: వేసవి కాలంలో తాపం... దాహం తీర్చుకునేందుకు వానరం పడ్డ పాట్లు... వీడియో!
- తలకోనలో ఎండిపోయిన నీటి చలమలు
- దప్పికతో వాటర్ క్యాన్ల మూతలు తీసిన కోతి
- నీటిని అందుకోలేక అవస్థలు
మండుతున్న ఎండల్లో గొంతెండిపోతే... ఆ సమయంలో కాసింత మంచినీరు నోట్లో పడాల్సిందే. మనిషికైనా, జంతువుకైనా నీటి అవసరం ఎంతో ఉంది. తాగేందుకు నీరు లభించకుంటే ఎన్నో అవస్థలు తప్పవు. మంచినీటి కోసం కిలోమీటర్ల దూరం ఎండలో వెళ్లి, నీటి బిందెలను నెత్తిపై పెట్టుకుని వచ్చేవారిని ఎందరినో చూసుంటాం.
ఇక తాజాగా చిత్తూరు జిల్లాలోని తలకోన అటవీ ప్రాంతంలో నీటి చలమలు ఎండిపోగా, తన దాహార్తిని తీర్చుకునేందుకు ఓ వానరం పడ్డ పాట్ల వీడియో వైరల్ అవుతోంది. ఓ దుకాణం ముందున్న మినరల్ వాటర్ క్యాన్ల మూతలను సునాయాసంగా తీస్తున్న ఈ కోతి, అందులోని నీటిని మాత్రం తాగలేక అవస్థలు పడింది. తలకోనలోని సిద్ధేశ్వర స్వామి ఆలయ క్షేత్ర సమీపంలో ఈ ఘటన జరిగింది. అంత కష్టపడి ఎన్నో క్యాన్ల మూతలను తీసినప్పటికీ, దాని దాహం మాత్రం తీరలేదు. ఈ వీడియో చూసిన వారు అయ్యో పాపం అనకుండా ఉండలేకపోతున్నారు.