Hyderabad: నిరాహారదీక్ష చేస్తున్న బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ కు అస్వస్థత
- కడుపు నొప్పితో బాధపడుతున్న లక్ష్మణ్
- వైద్యులకు తెలియజేసిన లక్ష్మణ్ వ్యక్తిగత సిబ్బంది
- ఇంటర్ విద్యార్థులకు న్యాయం కోసం లక్ష్మణ్ దీక్ష
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలను నిరసిస్తూ టీ-బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ నిమ్స్ లో నిరాహారదీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. నాలుగు రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న లక్ష్మణ్ అస్వస్థతకు గురయ్యారు. ఎటువంటి ఆహారం, ఫ్లూయిడ్స్ తీసుకోక పోవడంతో లక్ష్మణ్ కడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ మేరకు వైద్యులకు లక్ష్మణ్ వ్యక్తిగత సిబ్బంది సమాచారమిచ్చారు. కాగా, ఇంటర్ విద్యార్థులకు న్యాయం జరిగే వరకూ తన నిరాహారదీక్ష విరమించే పరిస్థితే లేదని లక్ష్మణ్ స్పష్టం చేశారు. గత నెల 29న తన నిరవధిక నిరాహార దీక్షను లక్ష్మణ్ ప్రారంభించారు.