Gujarath: గుజరాత్ రైతులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకున్న ‘పెప్సీ కో’
- ప్రభుత్వంతో చర్చించాక ఈ కేసుల ఉపసంహరణ
- లేస్, చిప్స్ కోసం బంగాళాదుంపపై ‘పెప్సీ కో’ పేటెంట్
- పేటెంట్ పొందిన బంగాళాదుంపలను పండించిన రైతులు
దేశ వ్యాప్తంగా రైతుల ఆందోళనతో పెప్సీ కో కంపెనీ వెనక్కి తగ్గింది. గుజరాత్ రైతులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకుంటామని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రభుత్వంతో చర్చించిన తర్వాత రైతులపై పెట్టిన కేసులను తమ కంపెనీ ఉపసంహరించుకుందని అన్నారు. కాగా, పెప్సీకోకు చెందిన లేస్, చిప్స్ కోసం బంగాళాదుంపపై ఆ సంస్థ పేటెంట్ తీసుకుంది. పేటెంట్ పొందిన బంగాళాదుంపలను గుజరాత్ రైతులు నలుగురు పండించారని ఆరోపిస్తూ వారిపై పెప్సీకో సంస్థ కేసు పెట్టింది. ‘పెప్సీకో’ తీరును నిరసిస్తూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు పెల్లుబికాయి. ఈ నేపథ్యంలో ఆ నలుగురు రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుంది.