Chiranjeevi: చిరంజీవి ఫాం హౌస్‌లో అగ్నిప్రమాదం.. తగలబడుతున్న ‘సైరా’ సెట్

  • పెద్ద ఎత్తున ఎగసిపడుతున్న మంటలు
  • అదుపు చేస్తున్న సిబ్బంది
  • కోట్ల రూపాయల నష్టం
టాలీవుడ్ ప్రముఖ నటుడు చిరంజీవి ఫాంహౌస్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. హైదరాబాద్ శివారు మణికొండలోని ఆయన ఫాంహౌస్‌లో అకస్మాత్తుగా మంటలు ఎగసిపడ్డాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న చిరంజీవి తదుపరి చిత్రం ‘సైరా’ కోసం వేసిన సెట్టింగ్ మంటల్లో తగలబడుతోంది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

 ప్రమాదంతో ఒక్కసారిగా అప్రమత్తమైన సిబ్బంది వెంటనే మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే, అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. సినిమా సెట్ దాదాపు బూడిదైనట్టు తెలుస్తోంది. దీంతో కోట్లాది రూపాయల నష్టం వాటిల్లినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Chiranjeevi
sye raa
Hyderabad
farmhouse
Tollywood

More Telugu News