Andhra Pradesh: సీఎస్ వ్యాఖ్యలకు టీటీడీ ఈవోగా నేను స్పందించలేను: ఈవో సింఘాల్

  • బంగారం తరలింపు విషయంలో ఆరోపణలు
  • చట్టపరమైన చర్యల అంశాన్ని పాలక మండలి నిర్ణయిస్తుంది
  • ప్రతిరోజు పరకామణిలో లెక్కింపు జరిగేలా ఏర్పాట్లు

బంగారం తరలింపు విషయంలో టీటీడీపై సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలకు ఈవోగా తాను స్పందించలేనని అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. బంగారం తరలింపు విషయంలో ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అంశాన్ని పాలక మండలి నిర్ణయిస్తుందని అన్నారు. పరకామణిలో తలెత్తిన ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయాయని స్పష్టం చేశారు. ప్రతిరోజు పరకామణిలో లెక్కింపు జరిగేలా ఏర్పాట్లు చేశామని వివరించారు. వేసవిలో భక్తుల రద్దీ దృష్ట్యా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్టు చెప్పారు. కొత్తగా భక్తుల సంక్షేమ కమిటీని ఏర్పాటు చేశామని, ఏప్రిల్ లో శ్రీవారిని 21.96 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని, హుండీ ఆదాయం రూ. 84.7 కోట్లు అని పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News