Andhra Pradesh: ఆర్టీజీఎస్ సేవలకు ఒడిశా ప్రభుత్వం కృతజ్ఞతలు
- ఆర్టీజీఎస్ అంచనాలు నిజమయ్యాయి
- సహాయక చర్యలకు ఎంతగానో ఉపయోగపడ్డాయి
- ఆర్టీజీఎస్ సిబ్బందిని అభినందించిన సీఎస్
‘ఫణి’ తుపాన్ కు సంబంధించి తమకు అద్భుత సమాచారం అందించిన ఆర్టీజీఎస్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఒడిశా ప్రభుత్వం పేర్కొంది. ఆర్టీజీఎస్ అంచనాలు నిజమయ్యాయని, సహాయక చర్యలకు ఎంతగానో ఉపయోగపడ్డాయని పేర్కొంది. ‘ఫణి’ తుపాన్ పై ఆర్టీజీఎస్ నిరంతరం సమాచారాన్ని అందించింది. ఆ దిశగా ఒడిశా యంత్రాంగాన్ని ఏపీ ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఆర్టీజీఎస్ సిబ్బంది ఇరవై నాలుగు గంటలు పని చేసింది. స్టేట్ కమాండ్ సెంటర్ లో మకాం వేసిన సీఈఓ బాబు.ఎ, సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం నిరంతరం పరిస్థితిని సమీక్షించారు. కాగా, నిరంతర సమాచారం అందించిన ఆర్టీజీఎస్ ను సీఎస్ ప్రశంసించారు. సీఈఓ బాబు, సిబ్బందిని ఆయన అభినందించారు.