Odisha: ఒడిశాలో ఫణి బీభత్సం.. కమ్యూనికేషన్ వ్యవస్థ ధ్వంసం
- అల్లకల్లోలంగా ఒడిశా
- సహాయక శిబిరాల్లో ప్రజలు
- స్తంభించిన రవాణా వ్యవస్థ
ఫణి తుపాను కారణంగా శ్రీకాకుళంలో భారీ వర్షపాతం నమోదైంది. వంశధార నదికి భారీ వర్షాల కారణంగా వరదలు వచ్చే ప్రమాదం ఉందని, జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతానికైతే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ముప్పు తప్పిందని అధికారులు తెలిపారు. అయితే ఒడిశా మాత్రం అల్లకల్లోలంగా మారింది. ఈదురు గాలులు, కుంభవృష్టితో జనజీవనం స్తంభించింది. ప్రజలు సహాయక శిబిరాల్లోనే తలదాచుకుంటున్నారు. ఇప్పటికే ఒడిశాలోని రవాణా వ్యవస్థ స్తంభించింది. తాజాగా కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా ధ్వంసమైంది. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.