Andhra Pradesh: వివాహం విద్యానాశనం.. శోభనం సర్వనాశనం!: పెళ్లిపై పోసాని ఫన్నీ కామెంట్స్
- పీహెచ్ డీ 3 నెలల్లో ముగుస్తుందనగా పెళ్లి చేశారు
- మా ఇద్దరి చదువులు అక్కడితో ఆగిపోయాయి
- కానీ అంతకంటే ముఖ్యమైన సాన్నిహిత్యం, ప్రేమ ఏర్పడ్డాయి
పెళ్లి కారణంగా తన పీహెచ్ డీతో పాటు తన భార్య చదువు కూడా ఆగిపోయిందని ప్రముఖ సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి తెలిపారు. తన పీహెచ్ డీ మరో 3 నెలల్లో ముగిసిపోతుందనగా, పెద్దలు పెళ్లి చేశారని గుర్తుచేసుకున్నారు. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పోసాని మాట్లాడుతూ.. ‘‘నా భార్య పేరు కుసుమలత.. తను బీఎస్సీ, బీఎల్ చదవింది. తను ఎంఎల్ సెకండియర్ పరీక్షలు రాస్తుండగా మా పెళ్లి అయింది. నేను ఎంఏ, ఎంఫిల్ చేశాను. అప్పటికే పీహెచ్ డీ మూడేళ్లు పూర్తయ్యాయి.
ఇంకో 3 నెలల్లో వైవా చేస్తే నాకు డాక్టరేట్ వచ్చేది. ఇంకో 2-3 నెలలు ఆగిఉంటే మా ఆవిడ ఎంఎల్ కూడా అయిపోయేది. కానీ సరిగ్గా అప్పుడే మా పెళ్లిని కుదిర్చారు పెద్దలు. ఇంకేముంది... పెళ్లయితే మీకు తెలుసు కదా. ‘వివాహం విద్యానాశనం.. శోభనం సర్వనాశనం’ కాబట్టి మా పీజీలు పోయాయి. కానీ దాన్ని మించిన సాన్నిహిత్యం, అనురాగం ఏర్పడ్డాయి. మేము భార్యభర్తల్లాగా కాకుండా స్నేహితులు లాగే ఉంటాం. ఇంట్లో మామూలుగా ఆయా విషయాల్లో నిర్ణయాధికారం నా భార్యదే. ముఖ్యమైన విషయాల్లో మాత్రం చర్చించి నిర్ణయం తీసుకుంటాం’’ అని పోసాని చెప్పుకొచ్చారు.