Fani: బంగ్లాదేశ్ లో ఫణి బీభత్సం... 14 మంది మృతి

  • 16 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు
  • తీవ్ర వాయుగుండంగా మారి బలహీనపడిన ఫణి
  • బంగ్లాదేశ్ లో భారీ వర్షాలు, తీవ్ర గాలులు

బంగాళాఖాతంలో ఏర్పడిన ఫణి తుపాను భారత్ నుంచి బంగ్లాదేశ్ లో ప్రవేశించింది. శుక్రవారం ఉదయం ఒడిశా వద్ద తీరం దాటిన ఫణి, పశ్చిమ బెంగాల్ మీదుగా ఇవాళ బంగ్లాదేశ్ తీరాన్ని తాకింది. ప్రస్తుతం ఫణి తీవ్ర వాయుగుండంగా మారి, తర్వాత బలహీనపడింది. దీని కారణంగా బంగ్లాదేశ్ లో భారీ వర్షాలు, తీవ్రమైన గాలులు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. ఇప్పటివరకు బంగ్లాదేశ్ లో 14 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా 16 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

  • Loading...

More Telugu News