S.Janaki: గాయని జానకికి కీలుమార్పిడి శస్త్రచికిత్స.. మూడు వారాల విశ్రాంతి

  • బంధువుల ఇంట్లో జారిపడిన జానకి
  • కీలు మార్పిడి ఆపరేషన్ చేసిన వైద్యులు
  • కర్ణాటక ప్రజల ప్రేమాభిమానాల వల్లే కోలుకోగలిగానన్న గాయని
బంధువుల ఇంట్లో కాలుజారి కిందపడి గాయాలపాలైన దిగ్గజ గాయని ఎస్.జానకి (81) శనివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మైసూరులోని బంధువుల ఇంటికి వచ్చిన జానకి ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడ్డారు. గాయాలపాలైన ఆమెను వెంటనే మైసూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. కీలు దెబ్బతినడంతో వెంటనే ఆమెకు కీలు మార్పిడి ఆపరేషన్ చేశారు. మూడు రోజులుగా ఆసుపత్రిలోనే ఉన్న ఆమె ఆరోగ్యం కుదుటపడడంతో శనివారం ఆమెను డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా జానకి మాట్లాడుతూ.. కర్ణాటక ప్రజల ప్రేమాభిమానాలతోనే తాను త్వరగా కోలుకున్నట్టు తెలిపారు. మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పినట్టు జానకి తెలిపారు.
S.Janaki
singer
mysore
Karnataka
Hospital

More Telugu News