T20 mumbai league: ముంబై టీ20 లీగ్ వేలంలో రూ.5 లక్షలకు అమ్ముడుపోయిన సచిన్ కుమారుడు

  • టీ20 ముంబై లీగ్ రెండో సీజన్ కోసం వేలం
  • అర్జున్‌ను రూ. 5 లక్షల గరిష్ట ధరకు కొన్న ఆకాశ్ టైగర్స్ యాజమాన్యం
  • ఈ నెల 14 నుంచి లీగ్ ప్రారంభం
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ టీ20 ముంబై లీగ్‌లో రూ.5 లక్షలకు అమ్ముడుపోయాడు. లీగ్ రెండో సీజన్ కోసం జరిగిన వేలంలో ఆకాశ్ టైగర్స్ ముంబై వెస్టర్న్ సబర్బ్ యాజమాన్యం అర్జున్‌ను రూ.5 లక్షలకు కొనుగోలు చేసింది. లెఫ్టార్మ్ పేసర్, బ్యాట్స్‌మన్ అయిన అర్జున్ ఇండియా అండర్ 19లో అనధికారిక టెస్టులు ఆడుతున్నాడు.

ముంబై లీగ్ కోసం అర్జున్‌ను ఆల్ రౌండర్ కేటగిరీలో లక్ష రూపాయల కనీస ధరతో చేర్చారు. అయితే, నార్త్ ముంబై పార్ట్‌నర్స్ అతడిని బిడ్ గరిష్ఠ ధర అయిన రూ.5 లక్షలకు కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. కాగా, ఈ నెల 14 నుంచి వాంఖడే స్టేడియంలో లీగ్ ప్రారంభం కానుంది.
T20 mumbai league
Aakash Tigers Mumbai Western Suburb
Sachin Tendulkar

More Telugu News