NEET: కొంపముంచిన రైలు ప్రయాణం...లేట్‌ కావడంతో నీట్‌ పరీక్ష రాయలేకపోయిన 500 మంది

  • విద్యార్థులంతా కర్ణాటక రాష్ట్రం  బళ్లారి, హుబ్లీకి చెందిన వారు
  • బెంగళూరు సెంటర్‌ కేటాయించడంతో హంపీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం
  • ఆరు గంటలు ఆలస్యంగా బెంగళూరు చేరిన రైలు

రైలు ఆరు గంటలు ఆలస్యంగా నడవడంతో సకాలంలో కేంద్రాలకు చేరుకోలేక 500 మంది విద్యార్థులు వైద్య విద్య కళాశాల్లో వ్రవేశం కోసం రాసే జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్‌)ను మిస్సయ్యారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారి, హుబ్లీ ప్రాంతాలకు చెందిన పలువురు విద్యార్థులకు బెంగళూరులోని దయానందసాగర్‌ కేంద్రాన్ని కేటాయించారు. మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష కావడంతో వీరంతా ఉదయం 7 గంటలకు బయలుదేరే హంపి ఎక్స్‌ప్రెస్‌  (రైలు నంబర్‌ 6591) ఎక్కారు.

మామూలుగా పరీక్ష రాసే అభ్యర్థులు అర గంట ముందే పరీక్ష కేంద్రంలోకి వెళ్లిపోవాలి. ఆ తర్వాత అనుమతించరు. ఆ ప్రకారం వీరు 1.30 గంటకు కేంద్రానికి చేరుకోవాల్సి ఉండగా బెంగళూరుకు రైలు 2.30 గంటలకు చేరుకుంది. దీంతో వీరంతా పరీక్ష రాయలేకపోయారు. రైల్వే శాఖ తప్పిదం వల్ల తాము పరీక్ష రాయలేకపోయామని, తమను మరోసారి పరీక్ష రాసేందుకు అనుమతించాలని వీరంతా సామాజిక మీడియా ద్వారా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి జవదేకర్‌కు విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News