chittibabu: నేను రిక్షా తొక్కుతుంటే మా అన్నయ్య రాజబాబు తట్టుకోలేకపోయాడు: చిట్టిబాబు
- తొలిసారిగా రిక్షావాడి వేషం వేశాను
- రిక్షా తొక్కడం నేర్చుకున్నాను
- నా కష్టం అన్నయ్య చూడలేకపోయాడు
అక్కినేని నాగేశ్వరరావుగారు కథానాయకుడిగా 'పల్లెటూరిబావ' షూటింగు సారథీ స్టూడియోలో జరుగుతోన్న రోజులవి. ఆ సినిమాలో రాజబాబు బావమరిది .. అంటే రమాప్రభ తమ్ముడి పాత్ర చేసేవారు కావాలి. 'మా తమ్ముడు చేస్తాడు' అని మా అన్నయ్య చెప్పడంతో నన్ను పిలిపించారు. నేను చేయను అన్నయ్య అంటే .. చేయవలసిందేనని పట్టుబట్టాడు. ఆ సినిమాలో నాది రిక్షావాడి వేషం .. నాకేమో రిక్షా రాదు. దాంతో స్నేహితుల సహకారంతో సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో రిక్షా తొక్కడం నేర్చుకున్నాను.
నా పాత్రకి సంబంధించిన షూటింగు మొదలైంది. రాజబాబును .. రమాప్రభను ఎక్కించుకుని నేను రిక్షా తొక్కాలి. ఈ సన్నివేశాన్ని శ్రీనగర్ కాలనీలో చిత్రీకరిస్తున్నారు. అది ఎత్తైన ప్రదేశం కావడంతో రిక్షా తొక్కలేకపోతున్నాను. నా బాధ చూసి మా అన్నయ్య ఇబ్బంది పడుతున్నాడు .. ఎంతైనా సొంత తమ్ముడిని కదా. చివరికి దర్శకుడు ప్రత్యగాత్మ గారితో 'బాబాయ్, హైట్ లో పెడితే వాడు ఎలా తొక్కుతాడు? వాడికి రిక్షా తొక్కడమే అలవాటు లేదు' అని అన్నాడు. దాంతో ఆయన డౌన్ లో తొక్కమని చెప్పి ఆ షాట్ తీశారు" అని చెప్పుకొచ్చారు.