KCR: ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ఆవశ్యకతపై కేరళ ముఖ్యమంత్రితో చర్చించిన కేసీఆర్
- లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న తీరుపై చర్చ
- ఫలితాల సరళి ఎలా ఉండబోతోంది?
- ఇతర పార్టీలు నిర్వహించాల్సిన పాత్ర
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా నేడు తెలంగాణ సీఎం కేసీఆర్ మరో అడుగు ముందుకేశారు. ఎంపీలు వినోద్, సంతోష్‌కుమార్‌లతో కలిసి కేరళ వెళ్లిన కేసీఆర్, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ను కలుసుకున్నారు. దీనికి ముందు కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి తిరువనంతపురంలోని అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు.
అనంతరం విజయన్‌తో భేటీ అయిన కేసీఆర్ దేశంలోని తాజా రాజకీయ అంశాలపై చర్చించారు. లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న తీరు, ఫలితాల సరళి ఎలా ఉండబోతోంది? బీజేపీ, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఇతర పార్టీలు నిర్వహించాల్సిన పాత్రతో పాటు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ఆవశ్యకత తదితర అంశాలపై కేసీఆర్, విజయన్‌తో చర్చించారు.