Telangana: తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఉపఎన్నిక
- 31న రంగారెడ్డి, నల్లగొండ, వరంగల్ స్థానాలకు ఉపఎన్నిక
- రేపు నోటిఫికేషన్ విడుదల
- మే 14వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ
తెలంగాణలో ఖాళీ అయిన మూడు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 31న రంగారెడ్డి, నల్లగొండ, వరంగల్ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ రేపు విడుదల కానుంది. మే 14వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 15న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ 17 కాగా, మే 31న పోలింగ్ జరగనుంది. జూన్ 3న ఓట్ల లెక్కింపు జరగనున్నట్టు సమాచారం. కాగా, పట్నం నరేందర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లు ఎమ్మెల్యేలుగా గెలుపొందడంతో ఆయా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. గత డిసెంబర్ లో కొండా మురళీ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.