raksha: నేను సినిమాల్లోకి రావడం మా నాన్నకి ఇష్టం లేదు: నటి రక్ష
- నా అసలు పేరు రాణి
- తెలుగులో 'రక్ష'గా మార్చారు
- చిన్న పాత్రలతోనే కెరియర్ మొదలు
తెలుగులో 'రక్ష' చేసిన తొలి సినిమా 'చిరునవ్వుల వరమిస్తావా'. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ సినిమాల్లో ఆమె కథానాయికగా నటించారు. ఒరియా .. భోజ్ పురి చిత్రాల్లో కేరక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు. అలాంటి 'రక్ష' తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు.
"నా అసలు పేరు రాణి .. తెలుగు సినిమాల్లోకి వచ్చాక 'రక్ష' గా మార్చారు. మాది 'అనకాపల్లి' దగ్గరలోని ఒక పల్లెటూరు. సినిమాలను నిర్మించాలనే ఉద్దేశంతో మా నాన్న మమ్మల్ని తీసుకుని చెన్నైకి వచ్చారు. ఎన్టీఆర్ .. శోభన్ బాబులతో సినిమాలు చేశారు. ఆ రెండు సినిమాలు నష్టాలు తెచ్చిపెట్టాయి. ఇక నేను సినిమాల్లోకి రావడం మా నాన్నకు ఇష్టం లేదు. అయినా ఆయనను ఒప్పించి, తమిళంలో చిన్న చిన్న పాత్రలు వేయడం మొదలుపెట్టాను. గ్రూప్ డాన్సులు కూడా చేసేదానిని. ఇళయరాజా గారి బ్రదర్ గంగై అమరన్ గారు .. నాలో హీరోయిన్ లక్షణాలు ఉన్నాయని గమనించారు. దాంతో నేను హీరోయిన్ ను అయ్యాను" అని చెప్పుకొచ్చారు.