uno: ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం ఉండాల్సిందే: ఫ్రాన్స్
- ఇండియా, జర్మనీ, బ్రెజిల్, జపాన్ లకు శాశ్వత సభ్యత్వం కల్పించాలి
- అప్పుడే సమతుల్యం ఏర్పడుతుంది
- మరిన్ని కీలక దేశాల శాశ్వత హోదా కలిగి ఉండాలనేది మా వ్యూహాత్మక అంశం
ఐక్యరాజ్యసమితిలో కీలక విభాగమైన భద్రతామండలి పరిధి మరింత విస్తృతమవుతున్న తరుణంలో... భారత్ కు భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం ఉండాల్సిందేనని ఫ్రాన్స్ డిమాండ్ చేసింది. ఇండియాతో పాటు జర్మనీ, బ్రెజిల్, జపాన్ లకు కూడా శాశ్వత సభ్యత్వాన్ని కల్పించాలని తెలిపింది. భద్రతామండలిని విస్తరించే క్రమంలో మరిన్ని కీలక దేశాలు శాశ్వత సభ్యులుగా ఉండాలనేది తమ వ్యూహాత్మక అంశమని చెప్పింది. అప్పుడే సమతుల్యం ఏర్పడుతుందని తెలిపింది. మరోవైపు భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ కూడా ఎంతో కాలంగా ప్రయత్నిస్తోంది.