sv krishnareddy: ట్రైన్లో వెళుతూ ఉండగా 'యమలీల' కథ పుట్టింది: దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి
- దర్శకుడిగా ఎస్వీ కృష్ణారెడ్డికి మంచి పేరు
- 'యమలీల' సినిమాకి ప్రత్యేక స్థానం
- ఏడాది పాటు ఏకధాటిగా ఆడిన సినిమా
కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా ఎస్వీ కృష్ణారెడ్డికి మంచి పేరు వుంది. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాల జాబితాలో 'యమలీల' ప్రథమ స్థానంలో నిలుస్తుంది. ఈ సినిమా విడుదలై 25 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమాను గురించి తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.
"ఒకసారి నేను రైల్లో ప్రయాణం చేస్తున్నాను. బెర్త్ పై పడుకుని ట్రైన్ శబ్దం వింటున్నాను. ఆకాశంలో నుంచి ఏదైనా ఒక వస్తువు నాపై పడితే ఎలా ఉంటుంది? అనే ఆలోచన అప్పుడు వచ్చింది. యమలోకం నుంచి మనిషి భవిష్యత్తుకు సంబంధించిన పుస్తకం పడితే .. అది నాకు దొరికితే ఇంకా ఎంత బాగుంటుందో కదా అనే ఆలోచనగా అది మారింది. అలా వచ్చిన ఒక చిన్న ఆలోచన 'యమలీల' సినిమా రూపొందడానికి కారణమైంది. నేను చేసిన సినిమాల్లో ఏకధాటిగా ఏడాదిపాటు ఆడిన సినిమా అదే" అని ఆయన చెప్పుకొచ్చారు.