Andhra Pradesh: ఏపీలో పెరుగుతున్న ఎండల తీవ్రత.. కురిచేడులో అత్యధిక ఉష్ణోగ్రత!

  • గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రత 
  • ఏడు జిల్లాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత
  • గజపతినగరం మండలంలో వడదెబ్బకు మహిళ మృతి

ఏపీలో ఎండల తీవ్రత పెరుగుతోంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఈరోజు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లా కురిచేడులో అత్యధికంగా 46 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రత నమోదైంది. ఏడు జిల్లాల్లో ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటింది. ఏపీలోని 41 మండలాల్లో 45 నుంచి 47 డిగ్రీలకు పైబడి, 279 మండలాల్లో 43 నుంచి 45 డిగ్రీలు, 157 మండలాల్లో 41 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు సమాచారం. విజయనగరం జిల్లాలోని గజపతినగరం మండలంలో వడదెబ్బకు ఓ మహిళ మృతి చెందింది. కెంగువ గ్రామానికి చెందిన సువ్వాడ గౌరమ్మ (55) వడదెబ్బతో మృతి చెందినట్టు గ్రామస్తులు తెలిపారు.

  • Loading...

More Telugu News