KCR: తమిళనాడులో కేసీఆర్, కేటీఆర్.... అబ్దుల్ కలాం సమాధి వద్ద నివాళులు
- ఫెడరల్ ఫ్రంట్ కోసం గులాబీ బాస్ ప్రయత్నాలు
- రామేశ్వరంలో కేసీఆర్ కు ఘనస్వాగతం
- డీఎంకే అధినేత స్టాలిన్ తో రేపు చర్చలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ తమిళనాడు వెళ్లారు. కేసీఆర్ వెంట ఆయన తనయుడు, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఉన్నారు. తన మానస పుత్రిక ఫెడరల్ ఫ్రంట్ కోసం ఉత్సాహంతో ఉరకలేస్తున్న కేసీఆర్ ఇటీవలే కేరళ వెళ్లి వామపక్షాల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించారు. సీఎం పినరయి విజయన్ తో ఫ్రంట్ విషయమై చర్చించారు. తాజాగా, తమిళనాడు వెళ్లిన కేసీఆర్ డీఎంకే అధినేత స్టాలిన్ తో చర్చలు జరపనున్నారు.
ఇవాళ సాయత్రం రామేశ్వరం వెళ్లిన కేసీఆర్, కేటీఆర్ లకు అక్కడ ఘనస్వాగతం లభించింది. వారిరువురు అక్కడ ఉన్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సమాధి వద్ద నివాళులు అర్పించారు. రేపు ఉదయం మధురై వెళ్లనున్న కేసీఆర్ ఆ తర్వాత స్టాలిన్ తో భేటీ అవుతారు.