sagar: సావిత్రి ఇంట్లో పనివాడిగా చేరి కోటీశ్వరుడైన ఆ వ్యక్తి పేరు సుబ్రమణ్యం: దర్శకుడు సాగర్
- సావిత్రి గారి సినిమాలకి పనిచేశాను
- ఆమెను చాలా దగ్గరగా చూశాను
- సుబ్రమణ్యం ముందు వాచ్ మన్ గా చోటు సంపాదించాడు
తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలను సాగర్ తెరకెక్కించారు. కుటుంబ కథాచిత్రాల దర్శకుడిగా ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, సావిత్రిని గురించి ప్రస్తావించారు. "సావిత్రి సినిమాలకి నేను పని చేశాను .. అందువలన ప్రతిరోజు ఆమె ఇంటికి వెళుతూ ఉండేవాడిని. ఈ కారణంగా ఆమెను నేను చాలా దగ్గరగా చూశాను.
'మహానటి' సినిమాలో సావిత్రిని నమ్మించి ఒక పనివాడు మోసం చేసినట్టుగా చూపించారు .. ఆ పనివాడి పేరు సుబ్రమణ్యం. ప్రతిరోజు వచ్చి సావిత్రి ఇంటి ముందు నుంచునేవాడు. సావిత్రిగారు కార్లో వెళుతూ .. వస్తూ అతణ్ణి చూసేవారు. ఆమె దయదలచడం వలన వాచ్ మన్ షెల్టర్ లో చోటు సంపాదించాడు. కొన్ని రోజుల తరువాత సావిత్రి ఇంట్లోకి వచ్చేశాడు. అలా ఒకప్పుడు మద్రాసులో అడుక్కోవడానికి వచ్చినవాడు .. ఈ రోజున చెన్నైలోని కోటీశ్వరుల జాబితాలో ఒకడుగా కనిపిస్తాడు" అని చెప్పుకొచ్చారు.