shahid kapoor: ఆసక్తిని రేపుతోన్న 'కబీర్ సింగ్' ట్రైలర్

  • షాహిద్ కపూర్ హీరోగా 'కబీర్ సింగ్'
  • కథానాయికగా కైరా అద్వాని 
  • జూన్ 21వ తేదీన భారీ విడుదల 

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో కొంతకాలం క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'అర్జున్ రెడ్డి' సంచలన విజయాన్ని నమోదు చేసింది. దర్శకుడిగా ఈ సినిమా సందీప్ రెడ్డికి మంచి పేరు తెచ్చిపెట్టింది. దాంతో ఇదే సినిమాను ఆయన హిందీలోకి రీమేక్ చేశారు. తెలుగులో విజయ్ దేవరకొండ చేసిన పాత్రలో షాహిద్ కపూర్ .. షాలినీ పాండే చేసిన పాత్రలో కైరా అద్వాని కనిపించనున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. కథానాయకుడి స్వభావం .. ఆయా సందర్భాల్లో ఆయన ఎమోషన్స్ కు సంబంధించిన సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ కి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ చూస్తుంటే, హిందీ వెర్షన్లో పెద్దగా మార్పులు చేయలేదనిపిస్తోంది. జూన్ 21వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. మరి హిందీలో ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.

  • Loading...

More Telugu News