kirrak rp: హోటల్లో ప్లేట్లు కడిగాను .. బియ్యం బస్తాలు మోశాను: 'జబర్దస్త్' కిర్రాక్ ఆర్పీ
- మాది చాలా పేద కుటుంబం
- రచన .. నటన పట్ల ఆసక్తి ఉండేది
- హోటల్లో చేస్తూ సినిమాల్లో ట్రై చేశాను
'జబర్దస్త్' కామెడీ షో ద్వారా చాలామంది నటులు పాప్యులర్ అయ్యారు. ఈ షో ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న నటుల్లో 'ఆర్పీ' ఒకరు. ఐ డ్రీమ్స్ కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తనకి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు. "మాది నెల్లూరు జిల్లాలోని ఒక మారుమూల గ్రామం. మాది చాలా పేద కుటుంబం. ఇంట్లో ఎన్ని సమస్యలున్నా అందరినీ నవ్విస్తూ ఉండేవాడిని.
కాలేజ్ రోజుల్లోకి వచ్చేసరికి నటన .. రచనలో మంచి పట్టు దొరికింది. సినిమాల్లో ట్రై చేయమని అంతా అనడం మొదలుపెట్టారు. రెండు జతల బట్టలు పెట్టుకుని హైదరాబాద్ వచ్చేశాను. ఒక వైపున సినిమాల్లో ప్రయత్నాలు చేస్తూనే, మరో వైపున హోటల్లో పనిచేస్తూ వెళ్లాను. హోటల్లో ప్లేట్లు కడిగేవాడిని .. బస్తాలు మోసేవాడిని. అసిస్టెంట్ డైరెక్టర్ గా 'గేమ్' అనే సినిమా చేశాను. ఆ తరువాత సినిమా .. సినిమాకి గ్యాప్ వచ్చినప్పుడల్లా హోటల్లోనే పనిచేస్తూ వచ్చాను" అని చెప్పుకొచ్చాడు.