Maruthi Rao: జైలులో మారుతీరావు తమ్ముడి వజ్రపు ఉంగరాలు మాయం!

  • బెయిల్‌పై బయటకు వచ్చిన ప్రధాన నిందితులు
  • ఉంగరాలను భద్రపరిచిన నల్లగొండ జైలు అధికారులు
  • ఉంగరాలు పోయాయని పోలీసులకు ఫిర్యాదు
తెలుగు రాష్ట్రాల్లో ప్రణయ్ పరువు హత్య సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే జైలు అధికారులు భద్రపరిచిన మారుతీరావు తమ్ముడి డైమండ్ ఉంగరాలు మాయమవడం కలకలం రేపుతోంది. ఈ హత్య కేసులో ప్రధాన నిందితులైన తిరునగరు మారుతీరావు, ఆయన సోదరుడు శ్రవణ్ కుమార్, ఖరీం ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చారు.

అయితే శ్రవణ్ కుమార్ నల్లగొండ జైలులో ఉన్నప్పుడు ఆయన వేళ్లకు ఉన్న డైమండ్ ఉంగరాలను జైలు అధికారులు తీసుకుని భద్రపరిచారు. ప్రస్తుతం  అవి మాయమయ్యాయి. ఈ విషయమై జైలు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉంగరాల విలువ సుమారు రూ.6 లక్షలు ఉండొచ్చని శ్రవణ్ కుమార్ తెలియజేస్తున్నారు. అయితే జైలర్ జలంధర్ యాదవ్‌పై తమకు అనుమానం ఉన్నట్టు జైలు అధికారులు తెలిపారు.
Maruthi Rao
Sravan Kumar
Pranay
Khareem
Jalandhar Yadav
Police

More Telugu News