Drunk Driving: మందేసి చిక్కిన ట్రావెల్స్ డ్రైవర్ల విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు!

  • గత రాత్రి డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డ డ్రైవర్లు
  • డ్రైవర్ల లైసెన్స్ ల రద్దుకు సిఫార్సు
  • బస్సుల పర్మిట్ల రద్దుకు ఆర్టీయేకు నోటీసులు

గత రాత్రి మందు కొట్టి ప్రైవేటు బస్సులను నడుపుతూ, ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే ప్రయత్నం చేసిన డ్రైవర్ల వ్యవహారాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. బస్ డ్రైవర్లు మద్యం తాగడం అత్యంత తీవ్రమైన విషయమని, వారందరి డ్రైవింగ్ లైసెన్స్ ల రద్దుతో పాటు, బస్సుల నిర్వహణ, డ్రైవర్ల ఎంపికలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సదరు ట్రావెల్స్ బస్సుల పర్మిట్లను రద్దు చేయాలని సిఫార్సు చేయాలని నిర్ణయించారు.

తాగి బస్సు నడిపి ఏదైనా ప్రమాదం జరిపితే, బీమా డబ్బులు రావడం కూడా క్లిష్టమవుతుందని గుర్తు చేస్తున్న పోలీసు ఉన్నతాధికారులు, ఇటువంటి ఘటనలను చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఆర్టీయేకు ఇప్పటికే నోటీసులు పంపామని, వెంకట పద్మావతి, జీవీఆర్‌, కనకదుర్గ ట్రావెల్స్ యాజమాన్యాన్నీ విచారిస్తామని, వారి పర్మిట్ల రద్దుకు రికమండ్ చేస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News