Andhra Pradesh: టీడీపీ అడిగిన బూత్ లలో రీపోలింగ్ కు ఆదేశించకపోవడంపై చంద్రబాబు అసంతృప్తి!
- టీడీపీ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోలేదు
- వైసీపీ కోరిన బూత్ లలో మాత్రం రీపోలింగా!
- ఈసీ పక్షపాత ధోరణి మరోసారి రుజువైంది
చంద్రగిరి నియోజకవర్గంలోని 166, 310 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘానికి టీడీపీ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ విజ్ఞప్తిని ఈసీ పరిగణనలోకి తీసుకోకపోవడంపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఏడు బూత్ లలో రీపోలింగ్ నిర్వహించాలని వైసీపీ కోరితే అందులో ఐదు బూత్ లకు తిరిగి ఎన్నిక నిర్వహించనుండటం కరెక్టు కాదని విమర్శించారు. ఈ చర్యల ద్వారా ఈసీ పక్షపాత ధోరణి మరోసారి రుజువైందని, ఈ విషయమై ఎన్నికల కమిషన్ కు ఓ లేఖ రాస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.
కాగా,రాష్ట్ర వ్యాప్తంగా 49 పోలింగ్ కేంద్రాల్లో అవకతవకలు జరిగాయని, ఆయా కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని టీడీపీ నేత కళా వెంకట్రావు నిన్న డిమాండ్ చేశారు. ఈ మేరకు అదనపు సీఈవో సుజాత శర్మను కలిసి ఫిర్యాదు చేయడం తెలిసిందే.