bhanuchandar: అప్పటి సినిమాల్లో వున్నది .. ఇప్పటి సినిమాల్లో లేనిది కథే: భానుచందర్
- అప్పట్లో వరుస సినిమాలు చేశాను
- యాక్షన్ సీన్స్ లో సహజత్వం వుండటం లేదు
- 'జెర్సీ' వంటి సినిమాలను ప్రోత్సహించాలి
తెలుగు .. తమిళ భాషల్లో యాక్షన్ హీరోగా భానుచందర్ ఒక వెలుగు వెలిగారు. అలాంటి ఆయన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "అప్పట్లో మేము వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లే వాళ్లం. రోజుకు మూడు షిఫ్టులలో పనిచేసేవాళ్లం. అప్పటి సినిమాల్లో కథ ఉండేది .. మంచి సంగీతం ఉండేది .. యాక్షన్ సీన్స్ సహజత్వానికి దగ్గరగా వుండేవి. ఇప్పటి సినిమాల్లో ఆ మూడు కనిపించడం లేదు.
మంచి కథ .. ఆకట్టుకునే సంగీతం ఉండటం లేదు. ఇక యాక్షన్ సీన్స్ సహజత్వానికి చాలా దూరంగా ఉంటున్నాయి. చిటికేస్తే సుమోలు గాల్లోకి లేవడం .. కాలుతో నేలను తంతే ట్రక్కులు పైకి లేవడం .. ఒంటి చేత్తో ట్రైన్ ను ఆపడం వంటివి చూస్తుంటే నవ్వొస్తోంది. ఇటీవల వచ్చిన 'జెర్సీ' చూడండీ .. కథా కథనాలు ఎంత కొత్తగా ఉన్నాయో. అలాంటి సినిమాలను ప్రోత్సహించాలి" అని చెప్పుకొచ్చారు.