mayavati: ఆమె ఆశీర్వాదాలను సద్వినియోగం చేసుకోలేకపోయారు.. ఈసారి మిమ్మల్ని శిక్షిస్తుంది: మాయావతి

  • గంగామాత ఆశీస్సులతో 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చింది
  • ధనవంతులను మాత్రమే బీజేపీ పట్టించుకుంది
  • కాంగ్రెస్ పార్టీవి తప్పుడు విధానాలు, నిర్ణయాలు

బీజేపీ ఘోర ఓటమి పాలవుతుందని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. గంగామాత ఆశీస్సులతో 2014లో బీజేపీ గెలుపొందిందని, అయితే ఆమె ఆశీర్వాదాలను ఆ పార్టీ సద్వినియోగం చేసుకోలేదని తెలిపారు. ఈ సారి బీజేపీని ఆమె శిక్షిస్తుందని చెప్పారు. ద్వేషంతో కూడిన రాజకీయాలకు బీజేపీ పెట్టింది పేరని విమర్శించారు. కేవలం ధనవంతులను మాత్రమే ఆ పార్టీ సంరక్షించిందని, పేదలను పట్టించుకోలేదని అన్నారు.

ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీపై కూడా మాయావతి విమర్శలు గుప్పించారు. చాలా ఏళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉందని... ఆ పార్టీ తీసుకున్న తప్పుడు విధానాలు, నిర్ణయాల కారణంగా ప్రజలు తిరస్కరించారని అన్నారు. కాంగ్రెస్ హయాంలో దళితులకు ఒరిగిందేమీ లేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పాలన సరిగా ఉంటే ఉత్తరప్రదేశ్ లో బీఎస్పీ, ఎస్పీల అవసరమే లేదని అన్నారు. ఉద్యోగాలను కల్పిస్తామని, అవినీతిని పారదోలుతామని చెప్పుకునే కాంగ్రెస్ ఆ పని ఎప్పుడూ చేయలేదని... అందుకే ఆ పార్టీని ప్రజలు తిరస్కరించారని చెప్పారు.  

  • Loading...

More Telugu News