nani: 35 కోట్ల షేర్ ను రాబట్టిన 'జెర్సీ' .. హిట్ చిత్రాల జాబితాలో చేరిపోయినట్టే
- క్రితం నెల విడుదలైన 'జెర్సీ'
- వసూళ్లపై ప్రభావం చూపిన 'కాంచన 3'
- లాభాలు తెచ్చిపెట్టిన ప్రాజెక్టుగా 'జెర్సీ'
నాని కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన 'జెర్సీ' ఏప్రిల్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రికెట్ నేపథ్యంలో నిర్మితమైన ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాకి, తొలిరోజునే పాజిటివ్ టాక్ వచ్చింది. 'మంచి ప్రయత్నం' అంటూ ఈ సినిమా టీమ్ పై ప్రశంసల వర్షం కురిసింది. అయితే ఈ కంటెంట్ మాస్ ఆడియన్స్ కి అంతగా కనెక్ట్ కాలేదనే టాక్ వినిపించింది.
అదే రోజున మాస్ కంటెంట్ తో థియేటర్లకు వచ్చిన 'కాంచన 3' భారీ వసూళ్లతో దూసుకుపోయింది. ఈ సినిమా దూకుడు 'జెర్సీ' వసూళ్ల జోరును తగ్గించిందని చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలో 'జెర్సీ' సినిమాకి లాభాలు వచ్చాయా? నష్టాలు వచ్చాయా? అనేది అందరిలో సందేహాన్ని రేకెత్తిస్తోంది. ఈ సినిమా థియేట్రికల్ హక్కులను 27 కోట్లకు అమ్మారట. ఫుల్ రన్లో ఈ సినిమా 35 కోట్ల షేర్ ను రాబట్టిందనేది తాజా సమాచారం. అన్ని ఏరియాల్లో బయ్యర్లకు లాభాలు తెచ్చిపెట్టిన ఈ సినిమాను, హిట్ చిత్రంగా చెప్పుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.