PM: ఎన్నికల సంఘంపై మండిపడ్డ నారా లోకేశ్
- నలభై రోజుల తర్వాతా రీపోలింగ్ నిర్వహించేది?
- ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం
- ఎన్నికల సంఘం మోదీకి తొత్తుగా మారింది
చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ బూత్ లలో రీపోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ విషయమై మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ, ఎన్నికల పోలింగ్ జరిగిన నలభై రోజుల తర్వాత రీపోలింగ్ నిర్వహించడం ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు. రీపోలింగ్ పై తమ ఫిర్యాదులను ఈసీ పట్టించుకోలేదని ఆరోపించారు. ఎన్నికల సంఘం మోదీకి తొత్తుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.