West Bengal: బెంగాల్లో పెచ్చరిల్లిన హింస : తుది విడత పోలింగ్ సందర్భంగా పలుచోట్ల అలజడి
- రాష్ట్రంలోని 9 లోక్సభ నియోజకవర్గాల్లో ఓటింగ్
- చాలా కేంద్రాల్లో ఆలస్యంగా మొదలైన ప్రక్రియ
- ఈవీఎంలు పనిచేయక ఇబ్బందులు
పశ్చిమబెంగాల్లో మళ్లీ హింస చెలరేగింది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలోని 9 లోక్సభ నియోజకవర్గాల్లో ఈరోజు తుదివిడత పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈవీఎంలు మొరాయించడం, వీవీ ప్యాట్లు పనిచేయక పోవడంతో పలుచోట్ల ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమయింది.
ఈనేపథ్యంలో పలు చోట్ల తృణమూల్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఉత్తర, దక్షిణ కోల్కతా ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు జరిగాయి. సీపీఎం అభ్యర్థి కొనినికా ఘోష్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. తమ ఏజెంట్లను బయటకు పంపించి పోలింగ్ నిర్వహిస్తున్నారని ఆయన ఈ సందర్భంగా ఆరోపించారు.
శనివారం రాత్రి రాజర్హట్ ప్రాంతంలో బీజేపీ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. మధురాపూర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని రైడిఘి అసెంబ్లీ నియోజకవర్గంలో నాటుబాంబు దాడులు జరిగాయి. గత విడత పోలింగ్లో హింసాత్మక సంఘటననలు దృష్టిలో పెట్టుకుని ఈసారి మరింత కఠినమైన భద్రతా ఏర్పాట్లు చేసినా కొన్ని సంఘటనలు అనివార్యమయ్యాయి.