lok sabha: ముగిసిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్

  • 542 లోక్ సభ నియోజకవర్గాల్లో 7 విడతల్లో పోలింగ్
  • తుది విడతలో 7 రాష్ట్రాల్లో జరిగిన పోలింగ్
  • వేలూరు లోక్ సభ నియోజక వర్గం ఎన్నిక రద్దు
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈరోజు సాయంత్రం ఆరు గంటలతో ఏడో విడత పోలింగ్ ముగిసింది. మొత్తం 543 లోక్ సభ నియోజకవర్గాలకు గాను తమిళనాడులో వేలూరు స్థానం మినహా మిగిలిన స్థానాల్లో ఏడు విడతల్లో ఎన్నికల పోలింగ్ జరిగింది. తుదివిడతలో 7 రాష్ట్రాల్లోని 59 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించారు. కాగా, ఓ అభ్యర్థికి చెందిన నగదు పెద్ద మొత్తంలో లభించడంతో వేలూరు స్థానం ఎన్నిక రద్దు అయింది. ఈ ఎన్నికను రద్దు చేసినట్లు ఇటీవలే అధికారులు ప్రకటించారు.

కాగా, తుది విడత పోలింగ్ లో సాయంత్రం 6 గంటల వరకు యూపీలో 54.37 శాతం, పంజాబ్ లో 58.81 శాతం, మధ్యప్రదేశ్ లో 69.38, బెంగాల్ లో 73.05, హిమాచల్ ప్రదేశ్ లో 66.18 పోలింగ్ నమోదైంది.
lok sabha
Elections
poling
punjan
tamilanadu

More Telugu News