West Bengal: పశ్చిమ బెంగాల్ లో దీదీ కంటే ఓ మెట్టు పైనే నిలిచిన మోదీ!
- బీజేపీకి 19 నుంచి 23 స్థానాలు!
- తృణమూల్ పార్టీకి 19 నుంచి 22!
- గత ఎన్నికల్లో బీజేపీ గెలిచింది 2 సీట్లే
సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్ వరకు ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మధ్య నువ్వానేనా అనే రీతిలో పోరాటం సాగిన సంగతి తెలిసిందే. అయితే, ఎగ్జిట్ పోల్స్ లో మోదీదే పైచేయి అని అంచనాలు వెలువడ్డాయి. ఇండియా టుడే ఆక్సిస్ మై సర్వేలో పశ్చిమ బెంగాల్ లో బీజేపీకి 19 నుంచి 23 సీట్లు వస్తాయని భావిస్తున్నారు. అదే సమయంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ కు 19 నుంచి 22 స్థానాలు గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. పశ్చిమ బెంగాల్ లో మొత్తం 42 లోక్ సభ స్థానాలు ఉండగా, గత ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ గెలిచింది రెండంటే రెండు స్థానాలే. ఈ నేపథ్యంలో, తాజా ఎగ్జిట్ పోల్స్ కమలనాథుల్లో కొత్త ఉత్సాహం రేకెత్తిస్తున్నాయి.