Kamal Haasan: కమలహాసన్ కు ముందస్తు బెయిల్ మంజూరు
- స్వతంత్ర భారత్ లో తొలి తీవ్రవాది హిందువే అన్న కమల్
- తమిళనాడులోని అరవకురుచ్చిలో కేసు నమోదు
- మధురై బెంచ్ ను ఆశ్రయించిన కమల్
ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీధి మయ్యమ్ పార్టీ అధినేత కమలహాసన్ కు ఊరట లభించింది. పోలీసులు అరెస్ట్ చేయకుండా ఆయనకు మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ యాంటిసిపేటరీ బెయిల్ (ముందస్తు బెయిల్) మంజూరు చేసింది.
తమిళనాడులోని అరవకురుచ్చి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా కమల్ మాట్లాడుతూ, స్వతంత్ర భారతావనిలో తొలి తీవ్రవాది హిందువే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో, ఆయనపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో, అవరకురుచ్చిలోని ఓ పీఎస్ లో కమల్ పై కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్లు 153ఏ, 295ఏ ల కింద మత భావాలను కించారంటూ కేసు నమోదు చేశారు. కమల్ ను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో, ఆయన ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో, కమల్ కు కోర్టు ఊరటను కలిగించింది.