MJ Akbar: లేదు.. నేనామెను హోటల్‌కు రమ్మనలేదు: కోర్టుకు తెలిపిన ఎంజే అక్బర్
- అక్బర్‌పై పాత్రికేయురాలు ప్రియారమణి లైంగిక ఆరోపణలు
- గతేడాది అక్టోబరులో మంత్రి పదవికి అక్బర్ రాజీనామా
- ప్రియారమణిపై అక్బర్ పరువు నష్టం దావా
‘మీటూ’ ఉద్యమంలో భాగంగా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న ఎంజే అక్బర్ కేంద్రమంత్రి పదవి కోల్పోవాల్సి వచ్చింది. ఏసియన్ ఏజ్ పత్రికకు ఎడిటర్‌గా ఉన్న అక్బర్ ఉద్యోగం కోసం వెళ్లిన తనను లైంగికంగా వేధించారని, ఇంటర్వ్యూ కోసం హోటల్ గదికి రమ్మన్నారని ప్రముఖ పాత్రికేయురాలు ప్రియా రమణి ఆరోపించారు. ఆమె తర్వాత మరికొందరు కూడా అక్బర్‌పై ఆరోపణలు చేశారు.
ఫలితంగా గతేడాది అక్టోబరులో అక్బర్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే, రమణి చేసిన ఆరోపణలను ఖండించిన అక్బర్ ఆమెపై పరువునష్టం దావా వేశారు. ఈ కేసుకు సంబంధించి సోమవారం ఢిల్లీలోని అదనపు ఛీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సమర్ విశాల్ ఎదుట ఇరు పక్షాలకు సంబంధించిన న్యాయవాదులు హాజరై తమ వాదనలు వినిపించారు. ప్రియా రమణి చేసిన లైంగిక ఆరోపణలను తోసిపుచ్చిన అక్బర్ తరపు న్యాయవాది.. ఇంటర్వ్యూ కోసం రమణిని హోటల్‌కు రమ్మని అక్బర్ ఎప్పుడూ అడగలేదన్నారు.