sensex: నిన్న ఉవ్వెత్తున ఎగసి.. నేడు చతికిలపడ్డ మార్కెట్లు
- లాభాల స్వీకరణకు మొగ్గుచూపిన ఇన్వెస్టర్లు
- 382 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 119 పాయింట్లు పతనమైన నిఫ్టీ
ఎగ్జిట్ పోల్స్ ప్రభావంతో నిన్న స్టాక్ మార్కెట్లు దూసుకుపోయిన సంగతి తెలిసిందే. దాంతో నిన్న సెన్సెక్స్ ఏకంగా 1,422 పాయింట్లు పెరిగింది. అయితే, నిన్న ఉవ్వెత్తున ఎగసిన మార్కెట్లు నేడు చతికిల పడ్డాయి. ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కు మొగ్గుచూపడంతో నష్టాలను చవిచూశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 382 పాయింట్లు పతనమై 38,969కి పడిపోయింది. నిఫ్టీ 119 పాయింట్లు కోల్పోయి 11,709కి చేరుకుంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
రిలయన్స్ ఇండస్ట్రీస్ (1.08%), బజాజ్ ఫైనాన్స్ (0.76%), హిందుస్థాన్ యూనిలీవర్ (0.62%).
టాప్ లూజర్స్:
టాటా మోటార్స్ (-7.05%), మారుతి సుజుకి (-3.25%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.02%), భారతి ఎయిర్ టెల్ (-2.66%), మహీంద్రా అండ్ మహీంద్రా (-2.61%).